షర్మిలపై తీవ్రంగా మండిపడ్డ అనురాధ

జగన్ సోదరి షర్మిలపై టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. ఎండదెబ్బ తగిలి షర్మిల పిచ్చిపిచ్చిగా మాట్లాడుతోందని విమర్శించారు. చంద్రబాబు అహంబావి అనడానికి ఒక్క ఉదాహరణ చెప్పగలవా? అని షర్మిలను నిలదీశారు. ఆడవాళ్ల గురించి మాట్లాడే షర్మిల.. జగన్‌ కారణంగా జైలుకెళ్లిన శ్రీలక్ష్మి గురించి మాట్లాడాలన్నారు. జగన్ లక్ష కోట్లు దోచినందుకే షర్మిల ఉంగరం కొట్టేశారని ప్రజలు చెప్పుకుంటున్నారని ఆమె అన్నారు.