షాకింగ్ న్యూస్ అలోక్ వర్మ రాజీనామా

సీబీఐ చీఫ్ పదవి నుంచి తొలగింపుకు గురైన అలోక్ వర్మ ఏకంగా తన సర్వీసుకు రాజీనామా చేశారు. ఆయనను ప్రభుత్వం అగ్ని మాపక శాఖ డైరెక్టర్ జనరల్‌గా నియమించింది. కానీ ఆ పదవిని చేపట్టేందుకు ఆయన నిరాకరించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిక్రి, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేలతో కూడిన హైపవర్ కమిటీ గురువారం అలోక్ వర్మను సీబీఐ చీఫ్ పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.

సుప్రీంకోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పు మేరకు అలోక్ వర్మ బుధవారం సీబీఐ చీఫ్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. గురువారం ఆయన ఆ పదవి నుంచి తొలగింపుకు గురయ్యారు. ఆయన ఈ నెల 31న పదవీ విరమణ చేయవలసి ఉంది.