ఎస్పీ-బీఎస్పీ కూటమిపై మమత స్పందన ఇదీ..!

సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కూటమి ప్రకటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రజలు, గొప్పగొప్ప సంస్థలన్నీ ‘‘నిజమైన స్వతంత్ర స్ఫూర్తితో’’ నిలదొక్కుకోవాలన్నారు. ఒకప్పటి బద్ధ శత్రువులైన ఎస్పీ, బీఎస్పీ పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్టు ఇవాళ ఉదయం ఉమ్మడి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ స్పందిస్తూ… ‘‘భారతీయతను కాపాడుకుందాం. దీనికోసమే స్వతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలు త్యాగం చేశారు. ప్రజలు, గొప్పగొప్ప సంస్థలన్నీ నిజమైన స్వతంత్ర స్ఫూర్తితో నిలదొక్కుకునేందుకు కృషి చేయాలి..’’ అని పేర్కొన్నారు.