స‌ర్వేప‌ల్లి అభివృద్ధిపై ‘ సోమిరెడ్డి ‘ అంత‌రంగం.. భ‌ళా…!

స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం.. నెల్లూరు జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం. పూర్తి వ్య‌వ‌సాయ ఆధారిత‌మైన జిల్లాలో మ‌రింత గా వ్య‌వ‌సాయంపై ఆధార‌ప‌డిన నియోజ‌క‌వ‌ర్గం ఇదే. ఇక్క‌డ ఎక్కువ‌గా పొలం ప‌నులు, సాగుపై ఆధార‌ప‌డి జీవిస్తున్న రైతుల కుటుంబాలు అధికం. తాగు నీరు ఎంత ముఖ్యంలో సాగుకుకూడా నీరు అంతే ముఖ్య‌మైన ప్రాంతంగా ఇది తొలి వ‌రుస‌లో నిలిచింది. అయితే, ఇక్క‌డ నుంచి ఎక్క‌వ మంత్రి కాంగ్రెస్ త‌ర‌ఫున గెలిచిన ప్ర‌జాప్ర‌తినిధులు నియోజ‌క‌వ‌ర్గం ఓట‌ర్ల‌ను త‌మ అవ‌స‌రానికి వినియోగించుకున్నారే త‌ప్ప‌.. నియోజ‌క‌వ‌ర్గానికి వారు చేసిన సేవ అంటూ ప్ర‌త్యేకంగా ఏమీ క‌నిపించ‌దు. అంతేకాదు, ఇక్క‌డ అభివృద్దిపై ఎవ‌రికీ కూడా ప‌క్కా ప్ర‌ణాళిక కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

అయితే, అంద‌రూ అలానే ఉన్నారా? అంటే.. కాదు. ఒక‌రిద్ద‌రు నాయ‌కులు మాత్రం నియోజ‌క‌వ‌ర్గానికి అంకిత బావంతో సేవ చేయాల‌ని భావిస్తున్న‌వారు, నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయాల‌ని భావిస్తున్న వారు కూడా ఉన్నారు. ఇలాంటి వారిలో ప్ర‌స్తుత త‌రానికి ఐకాన్‌గా నిలుస్తున్నారు మంత్రి, సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి. ఇక్క‌డ 1994, 1999 ఎన్నిక‌ల్లో రెండు సార్లు సోమిరెడ్డి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత రెండు సార్లు కాంగ్రెస్ గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం సాధించాయి. అయితే, ఇక్క‌డ అభివృద్దిపై మాత్రం ఇక్కడ నుంచి గెలిచిన వైసీపీ నాయ‌కుడికి ఎలాంటి ప్ర‌ణాళిక లేక‌పోగా.. త‌న ప‌బ్బం గ‌డుపుకొనేందుకు మాత్ర‌మే ప్రాధాన్యం ఇచ్చారు.

ఇక‌, ఇప్పుడు జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న టీడీపీ నాయ‌కుడు సోమిరెడ్డి ప‌క్క స్కెచ్‌తో ఇక్క‌డ అభివృద్ధికి సంబంధించిన బ్లూప్రింట్‌ను రెడీ చేసుకున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయినా.. మంత్రిగా ఉన్న నేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గం, ఇక్క‌డి ప్ర‌జ‌ల‌పై ఉన్న మ‌మ‌కారంతో ఆయ‌న దాదాపు 2 వేల కోట్ల‌ను తీసుకువ‌చ్చి అనేక రూపాల్లో అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ఇక‌, ఇప్పుడు రాబోయే ఐదేళ్లకు సంబంధించి కూడా ఆయ‌న స్కెచ్‌ను సిద్ధం చేసుకున్నారు. వ్య‌వ‌సాయ ఆధారిత ప్రాంతం కావ‌డంతో ఇక్క‌డి రైతుల‌కు పుష్క‌లంగా నీటిని అందించేందుకు త‌న‌దైన శైలిలో వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇప్ప‌టికే ప్రారంభ‌మైన పెన్నా-గోదావ‌రి న‌దులఅనుసందానం పూర్తి చేయ‌డం తొలి ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకున్నారు.

ఈ ప‌నులు పూర్త‌యితే, ప్ర‌తి అంగుళానికి కూడా సాగునీరు అందుతుంది. ఏటా రెండు పంట‌లు పండుతాయి. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో ఆదాయం పెరుగుతుంది. అదేస‌మ‌యంలో పారిశ్రామికంగా కూడా నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేసుకునే అవ‌కాశం ఉంటుంది., ఇప్ప‌టికే చేసిన అభివృద్ధిని మ‌రింత‌గా కొన‌సాగించుకునే అవ‌కాశం కూడా ఉంటుంద‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఎలా చూసినా.. రాబోయే ఐదేళ్ల‌పాటు నియోజ‌క‌వ‌ర్గాన్ని అబివృద్ది చేయాల‌న్న త‌ప‌న సోమిరెడ్డిలో క‌నిపిస్తోంది. ఇదే విష‌యంపై ప‌రిశీల‌కులు సైతం సోమిరెడ్డి దూర‌దృష్టి, అంకిత‌భావాల‌ను మెచ్చుకుంటున్నారు.