బీజేపీ పై సంచలన కామెంట్ చెసిన విష్ణుకుమార్‌రాజు

ఏపీలో బీజేపీ పరిస్థితి బాగోలేదని, ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు చెప్పారు. వ్యక్తిగత కారణాలతో కొందరు బీజేపీని వీడారని తెలిపారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, ఏ పార్టీ నుంచి పోటీ చేసేది కోడ్ వచ్చాక చెప్తానన్నారు. కొందరు టీడీపీ నేతలు ఇసుక ర్యాంపుల్లో దోచుకుంటున్నారని విష్ణకుమార్‌రాజు ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల ముందు రాష్ట్రంలో బీజేపీకి వలసల కష్టాలు ఎదురవుతున్నాయి. బీజేపీకి బైబై చెప్పిన ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బాటలోనే మరికొందరు […]

వైసీపీ తొలి జాబితా రెడీ..

మరో నాలుగైదు నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ తన టీమ్‌ను సిద్ధం చేసుకుంటోంది. తెలంగాణలో ఎన్నికలకు నాలుగు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించడంతో… ఏపీలో కూడా వీలైనంత తొందరగా అభ్యర్థులను ప్రకటిస్తే తమకు గెలుపు సొంతమవుతుందనే భావనలో వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి వున్నట్టు సమాచారం. అందుకే ఇప్పటివరకూ నిర్వహించిన సర్వేల్లో సమర్థులుగా తేలినవారు, సిట్టింగ్‌లతో కలిపి 70 నుంచి 100 మందితో తొలి జాబితా సిద్ధం చేసినట్టు […]

2019 ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చేసిన ఎంపీ రాయపాటి

తాను తిరిగి నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నానని, వచ్చే ఎన్నికల్లో బరిలో నిలవనని కొంతమంది చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు. శనివారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో రాష్ట్రంలో ఏ ఎంపీకి తాను తీసిపోనని, గతంలో ఏ ఎంపీ హయాంలో జరగనన్ని అభివృద్ధి కార్యక్రమాలు నరసరావుపేట లోక్‌సభ స్థానం పరిధిలో తన హయాంలో జరిగాయన్నారు. వినుకొండ, మాచర్ల, గురజాల […]

లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఎప్పుడంటే..?

లోక్‌సభ ఎన్నికల తేదీలను మార్చిలో భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ప్రకటించే అవకాశాలున్నాయి. పండుగలు, స్కూలు పరీక్షల తేదలను సేకరించే ప్రక్రియలో ప్రస్తుతం ఈసీఐ ఉంది. ఆ ప్రక్రియ పర్తిగానే ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేయనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఏప్రిల్, మేలో ఎన్నికలు జరుగాల్సి ఉండగా ఎన్నికల తేదీలను మార్చి మధ్యలో ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది. ఆయా రాష్ట్రాల్లో పండుగలు, స్కూలు పరీక్షలకు ఇబ్బంది లేకుండా పోలింగ్ తేదీలు ఉండబోతున్నాయి. పలు దఫాలుగా లోక్‌సభ […]

టీడీపీతో జనసేన పొత్తుపై షాకింగ్ కామెంట్ చేసిన కళా

టీడీపీతో జనసేన కలుస్తుందన్న వార్తలపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు స్పందించారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం తమతో పవన్ కలిసివస్తే స్వాగతిస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్‌కు ఓటేస్తే నరేంద్రమోదీకి వేసినట్టేనని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పొలిటీషియన్ కాదని, నేరస్ధుడని మండిపడ్డారు. ప్రజా సమస్యల కంటే కేసులు నుంచి ఎలా తప్పించుకోవాలన్నదే ప్రతిపక్ష నేత ఆలోచన అని ఎద్దేవా చేశారు. […]

ప్రధాని అభ్యర్థి మమతే!

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత మమతా బెనర్జీని 2019 సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ తమ ప్రధాని అభ్యర్థిగా దాదాపుగా ప్రకటించింది. లౌకి క, ప్రగతిశీల భారతావని నిర్మాణం కోసం ఆమె సారథ్యంలో కలసి పనిచేద్దామని పార్టీ ఎంపీ, మమత మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భవించి 21 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ వీడియో సందేశమిచ్చారు. ప్రధాని పీఠంపై కన్నేసిన మమత- ఆ దిశగా ప్రాంతీయ పార్టీలను చేరదీస్తున్నారు. రాష్ట్రాల […]

‘నేను సీఎం అయినపోతాను’ అన్న పవన్ వ్యాఖ్యపై కత్తి కామెంట్

ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో పార్టీ సత్తా ఏంటో చూపించడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు కోస్తాఆంధ్ర పర్యటనలో పవన్ బిజీబిజీగా గడుపుతూ.. అప్పుడప్పుడు బహిరంగ సభలు పెట్టి కార్యకర్తలు, అభిమానుల్లో నూతన ఉత్సాహం నింపుతున్నారు. ఈ క్రమంలో పార్టీలో చేరడానికి వచ్చే నేతలను కాదనకుండా జనసేన కండువా కప్పుకుంటూ ముందుకెళ్తున్నారు. పర్యటనలో భాగంగా పిఠాపురంలో పవన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. పవన్ ఏమన్నారంటే..! ” పిఠాపురంలో […]

2019 వార్… బాబు ఇలా డిసైడ్ అయ్యారు

నాలుగేళ్ళ మిత్రబంధం తెగతెంపులయ్యింది ! విభజన సమస్యలతో సతమతమవుతూ ఆర్ధికంగా అనేక ఇబ్బందులకు గురవుతున్న ఏపీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదుకుంటుందని భావించింది అయితే ఆ సూచనలు కనిపించకపోగా ఏపీకి రావాల్సిన అనేక నిధులపై కొర్రీలు పెట్టడం , సాగునీటి ప్రాజెక్టులకు ఇవ్వాల్సిన నిధులపై దోబూచులాడడం తదితర కారణాలతో విసుగెత్తిపోయిన ఏపీ లోని అధికార పార్టీ బీజేపీకి రాంరాం చెప్పేసింది. ఈ దశలో ఏపీలో జనసేన మిత్రపక్షంగా ఉంటుందని మొదటి నుంచి టీడీపీ భావించింది. అయితే మొన్న […]

తెలంగాణలో టీ-టీడీపీ ఒంటరి పోటీ !

వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగేందుకు టీ టీడీపీ సిద్ధమవుతోందా ? ఈ మేరకు చంద్రబాబు నుంచి టీ టీడీపీకి స్పష్టమైన సంకేతాలు వచ్చాయా ? టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాటలను బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో టీ టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆదివారం హైదరాబాద్ వచ్చిన చంద్రబాబుతో సమావేశమైన అనంతరం ఎల్.రమణ మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆయన అనేక విషయాలు వెల్లడించారు. 2019 […]

మళ్ళీ టీడీపీయే… అదిరిందయ్యా చంద్రం

ప్రస్తుతం అన్ని పార్టీల్లోనూ ఎలక్షన్ సందడి మొదలైనట్లు కనిపిస్తోంది ! ఈ సందడి టీడీపీలో మరికాస్త ఎక్కువ కనబడుతోంది. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంతో మంచి జోష్ మీద ఉంది టీడీపీ. ప్రజల నుంచి కూడా సానుకూల స్పందన వస్తుండడంతో ఇదే ఉత్సహంతో ఎన్నికలకు వెళ్లేందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సిద్దమవుతుందన్న వార్తలతో రాష్ట్రంలోనూ ఆ వేడి పెరిగిపోయింది. రాష్ట్ర విభజన, ఆర్ధిక సంక్షోభం వంటి సమస్యలను చంద్రబాబు అధిగమించి రాష్ట్రంలో అనేక […]