‘ఎమ్మెల్యే పదవికి, పార్టీకీ రాజీనామా చేస్తా.. 21న జనసేనలో చేరతా.

‘‘ఈ నెల 21న విజయవాడలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరతా. అంతకు ముందే ఎమ్మెల్యే పదవికి, బీజేపీకి రాజీనామా చేస్తా. రాజీనామా పత్రాన్ని స్పీకర్‌ ఫార్మెట్‌లో పంపిస్తాను’’ అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ చెప్పారు. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానిస్తూ శుక్రవారం రాజమహేంద్రవరంలో జనసేన నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌తో భేటీ అయ్యాను. 21వ తేదీ ఉదయం 11 […]

ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ పొత్తుల్లేవ్?

తెలంగాణలో కలిసి పోటీ చేసినా.. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలుపుతున్నా.. రాష్ట్రంలో మాత్రం టీడీపీ, కాంగ్రెస్‌ వేర్వేరుగానే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల స్వరంలో వస్తున్న మార్పే ఇందు కు కారణం! అయితే, పొత్తులపై పార్టీ అధిష్ఠానానిదే తుది నిర్ణయం. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గురువారం 29 రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇతర రాష్ర్టాల పరిస్థితి ఎలా ఉన్నా… ఆంధ్రలో పరిస్థితి భిన్నంగా ఉందని రాష్ట్ర […]

బీజేపీ పై సంచలన కామెంట్ చెసిన విష్ణుకుమార్‌రాజు

ఏపీలో బీజేపీ పరిస్థితి బాగోలేదని, ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు చెప్పారు. వ్యక్తిగత కారణాలతో కొందరు బీజేపీని వీడారని తెలిపారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, ఏ పార్టీ నుంచి పోటీ చేసేది కోడ్ వచ్చాక చెప్తానన్నారు. కొందరు టీడీపీ నేతలు ఇసుక ర్యాంపుల్లో దోచుకుంటున్నారని విష్ణకుమార్‌రాజు ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల ముందు రాష్ట్రంలో బీజేపీకి వలసల కష్టాలు ఎదురవుతున్నాయి. బీజేపీకి బైబై చెప్పిన ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బాటలోనే మరికొందరు […]

బీజేపీకి ఇద్దరి రాజీనామా

బీజేపీకి పట్టణంలోని 12వ వార్డు అధ్యక్షుడు పగడాల వెంకటశివయ్య, 10వ వార్డు పార్టీ ప్రధానకార్యదర్శి దోసపాటి పానకాలు ఆదివారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. పార్టీలో పనిచేసినవారికి కాకుండా వేరే వారికి నియోజకవర్గ కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించినందుకు నిరసనగా రాజీనామా చేసినట్లు వారు తెలిపారు.

బాబుకు ఏపీ బీజేపీ నేతల సపోర్ట్

పోలవరం కారణంగా కేంద్రంలోని బీజేపీకి, ఏపీలోని టీడీపీ మధ్య దూరం పెరుగుతోందని జగన్ కు అనుకూలంగా ఉండే కొన్ని మీడియాలో ప్రచారం జోరుగా జరుగుతోంది. కేంద్రం పోలవరం విషయంలో సహాయ నిరాకరణ చేస్తోందని… ఈ విషయాన్ని చంద్రబాబు దాచిపెట్టి మభ్యపెడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే పోలవరం కారణంగా ఏపీ బీజేపీ చంద్రబాబుకు మరింతగా దగ్గరైందని ఆ పార్టీలోని కొందరు నేతలు చర్చించుకుంటున్నారు. మొన్నీమధ్యే ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి గడ్కరీని కలిసి వచ్చారు చంద్రబాబు. పోలవరంపై గడ్కరీ ఇచ్చిన […]

ఏపీలో బీజేపీ పరిస్థితి అంత దారుణంగా ఉందా ..?

బీజేపీ, మోడీ గాలి బలంగా వీస్తుంటే..ఏపీలో మాత్రం కొంచెం కూడా ఆ ప్రభావం కనిపించడంలేదు. ఇప్పటివరకు టీడీపీ చాటున బీజేపీ ఏపీలో నెట్టుకొస్తూ కాలం గడిపేసింది. ప్రస్తుతం ఏపీ బీజేపీకి ఒకటి రెండు జిల్లాల్లో మినహా పెద్దగా క్యాడర్ లేదు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం లేదు. ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో అక్కడకక్కడా బీజేపీ నేతలు కన్పిస్తారు. అయితే కేంద్రంలో అధికారంలోకి వచ్చి మూడేళ్లవతున్నా ఏపీలో పార్టీని బలోపేతం చేయడంపై నేతలు ఏ మాత్రం దృష్టి పెట్టలేదు. పార్టీ అధ్యక్షుడిని […]

టీడీపీతో పొత్తు లేకుంటే బీజేపీ చిత్తే ..!

పైత్య రోగికి పంచదార చేదు అన్నట్లుంది బీజీపీ పేద్దల తీరు ! ఎప్పటి నుంచో మిత్రపక్షం గా కొనసాగుతున్న టీడీపీని దూరం చేసుకునేలా బీజీపీ పెద్దలు వ్యవహాసరిస్తున్నారు. ఇటీవల ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షాలు అపాయింటుమెంట్ ఇవ్వకపోవడం కూడా ఈ వాదనకు బలం చేకూరుతోంది. రాబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలూ కలసి పోటీ చేస్తాయో లేదో అనేది పెద్ద డౌటే ! ఈ […]

సోము వీర్రాజును లైట్ తీస్కొంటోన్న‌ ఏపీ బీజేపీ

ఏపీలో బీజేపీలో చాలా మంది లీడ‌ర్లు వార్డు మెంబ‌ర్‌గా కూడా గెలిచే స‌త్తాలేని వాళ్లే ఉన్నారు. వార్డు మెంబ‌ర్‌గా కూడా పోటీ చేసి గెల‌వ‌లేని వాళ్లు కొండ‌కు నిచ్చెన‌లు వేస్తున్నారు. చంద్ర‌బాబు ద‌య‌తో ఎమ్మెల్సీ అయిన సోము వీర్రాజు ప‌దే ప‌దే చంద్ర‌బాబును, టీడీపీ ప్ర‌భుత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని విరుచుకుప‌డుతూ ఉంటారు. సొంత జిల్లాలో కాకినాడ కార్పొరేష‌న్‌కు ఎన్నిక‌లు జ‌రిగితే 9 వార్డులు బీజేపీకి ఇస్తే 3 గెలిచారు. ఇది అక్క‌డ సోము స‌త్తా. అక్క‌డ బీజేపీ […]

ఏపీ బీజేపీ కొత్త అధ్య‌క్షుడు ఎవరు.. రేసులో వీళ్లే..!

ఏపీ బీజేపీకి కొత్త అధ్య‌క్షుడి ఎంపిక పెద్ద స‌వాలుగా మారింది. ఎన్నో రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి సైతం తీసుకురాగ‌లిగిన బీజేపీ ర‌థ సార‌ధులు అమిత్ షా, ప్ర‌ధాని మోడీలు ఏపీకి ఒక అధ్య‌క్షుడిని నియ‌మించ‌డంలో మాత్రం త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. నిజానికి బీజేపీకి ఏపీ అత్యంత కీల‌క రాష్ట్రం. ఇక్క‌డ 2019 ఎన్నిక‌ల నాటికి బ‌లంగా ఎద‌గాల‌ని ఆ పార్టీ నిర్దేశించుకుంది. క‌నీసం 20 నుంచి 40 అసెంబ్లీ, 4 నుంచి 8 పార్ల‌మెంటు స్థానాలు గెలుచుకోవ‌డంతోపాటు […]