చంద్రబాబు సీరియస్ వార్నింగ్

ప్రకాశం జిల్లా అద్దంకిలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రౌడీయిజాన్ని సహించేది లేదని హెచ్చరించారు. తన దగ్గర రౌడీయిజం చేసేందుకు వైఎస్‌కే చేతకాలేదని, రౌడీల తోక కట్‌ చేస్తానని చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. 24 బాంబులేసినా తాను భయపడలేదని, ప్రజల రక్షణ కోసం తాను దేనికైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. రౌడీలు వస్తే మహిళలకు రక్షణ, భద్రత ఉండదని బాబు ప్రజలను అప్రమత్తం చేశారు. […]

ఏపీలో ప్రముఖ సినీ నటి ప్రచారం… ఆ పార్టీ నుంచే

ఏపీ ఎన్నికల్లో సినీ తారల సందడి కూడా మొదలైంది. ఇప్పటికే టీడీపీ తరపున హీరో నారా రోహిత్ ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు ప్రకటించేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ.. ఇతర నటీనటులు ప్రచారం చేస్తున్నారు. ఇక జగన్ తరపున ప్రచారం చేయడానికి మోహన్ బాబు, జయసుధ, అలీ లాంటి నటీనటులు చాలా మందే ఉన్నారు. కాగా.. తాజాగా మరో సినీ నటి పేరు ప్రధానంగా వినపడుతోంది. అలనాటి తార రేవతి ఏపీలో ఎన్నికల ప్రచారంలో […]

టీడీపీ తెలంగాణ ఓటు బ్యాంకు ఎటు వైపో

చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గంలోని శేరిలింగంపల్లి అన్ని పార్టీల అభ్యర్థులకు కీలకంగా మారింది. ఒకప్పుడు టీడీపీ కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం తెలుగుదేశం పార్టీకి సుమారు లక్ష ఓట్లు వచ్చాయి. తాజా ఎన్నికల్లో టీడీపీ పోటీలో లేకపోవడంతో ఆ పార్టీ ఓటు బ్యాంక్‌ ఎటువైపు మొగ్గుచూపుతుందో అన్న విషయం ఆసక్తిగా మారింది. గెలుపు విషయంలో వీరి ఓట్లు కీలకం కావడంతో వారిపై టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ప్రత్యేక దృష్టిసారించాయి. టీఆర్‌ఎస్‌ డివిజన్‌ స్థాయి […]

ఏపీలో టీడీపీ దూకుడు .. భారీగా పెరుగుతున్న మద్దతు

అసెంబ్లీ ఎన్నికల ముంగిట తెలుగుదేశం పార్టీకి ఊహించని మద్దతు లభిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి జామాయిత్‌ ఇస్లామిక్‌ హింద్‌ మద్దతు ప్రకటించగా.. తాజాగా ఏపీ యాదవ మహాసభ కూడా టీడీపీకి మద్దతు ప్రకటించింది. మహాసభ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోమవారం సీఎంతో భేటీ అయ్యారు. రాజధానిలో 10 ఎకరాల భూమిని, యాదవ సంక్షేమ భవన నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయించాలని యాదవ మహాసభ కోరింది. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారు. యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మాలకొండయ్య, […]

పేటలో రజనీకి వ్యతిరేకంగా ఒక్కటైన‌ ముస్లింలు… ఈ దాడులు త‌ట్టుకోలేం…!

చిలకలూరిపేట అంటే ప్రత్తిపాటి…ప్రత్తిపాటి అంటే చిలకలూరిపేట అనేలా….పేట ప్రజలకి ప్రత్తిపాటి పుల్లారావుతో అనుబంధం పెనవేసుకునిపోయింది. గత రెండు దశాబ్దాలుగా పేటలో పాగా వేస్తూ వస్తున్న ప్రత్తిపాటిని…ఈ సారి కూడా గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి మంత్రి అయిన పుల్లారావు…నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి గురించి పేటలో పిల్లోడిని అడిగిన చెబుతాడు. కష్టం ఉందనే వచ్చే ప్రజలకి…ఎల్లప్పుడు అండగానే ఉంటారు. అందుకే ఇక్కడ ప్రజలు ప్రత్తిపాటిని తమ కుటుంబ సభ్యుడుగా చూస్తారు. ప్రత్తిపాటికి […]

వైసీపీ వర్సెస్ టీడీపీ.. ఈ సారి గెలుపెవరిదో..

ఇక్కడ ఎన్నికల బరిలో నిలిచింది బావ.. బావమరిది. గత రెండు దఫాలుగా వారే ప్రత్యర్థులు.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి తలపడుతున్నారు. ఇతర పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నా.. అసలు యుద్ధం మాత్రం వీరి నడుమే. సిక్కోలులో అందరి చర్చా ఆమదాలవలస నియోజకవర్గంపైనే. ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ టీడీపీ నుంచి, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం వైసీపీ తరఫున హోరాహోరీ తలపడుతున్నారు. తమ్మినేని అక్క జయలక్ష్మి కుమారుడే రవికుమార్‌. అలాగే సీతారాం భార్య వాణి స్వయానా రవికుమార్‌కు […]

సంచలనం : నిన్న వైసీపీలోకి.. నేడు టీడీపీలోకి..!

కావలి రూరల్‌ మండలం ఆముదాలదిన్నె పంచాయతి కొన దిన్నెకు చెందిన పంచాయతి మాజీ ఉపాధ్యక్షుడు జంపాని తిరుపాలు ఆదివారం తిరిగి పార్లమెంటు అభ్యర్థి బీద మస్తాన్‌రావు సమక్షంలో టీడీపీలోకి వచ్చారు. టీడీపీకి చెందిన తిరుపాలు కావలి పట్టణ కేతిరెడ్డి రామకోటారెడ్డి పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుంటారు. రామకోటారెడ్డి కౌలు విషయం మాట్లాడదామని తిరుపాలును కావలికి పిలిపించి ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లి వైసీపీ కండువా వేసినట్లు తిరుపాలు తనయుడు తిరుపతి, శీనయ్య, సుధ, వెంకయ్య తెలిపారు. దీంతో […]

గుడివాడలో టీడీపీ దూకుడు… చంద్రబాబు ప్రచారం తర్వాత తారుమారైన అంచనాలు..

గుడివాడలోని టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. సీఎం చంద్రబాబు పర్యటనతో నేతలు, కార్యకర్తల్లో ధీమాను పెంచింది. గుడివాడలో శుక్రవారం జరిగిన సీఎం పర్యటనకు జనం భారీగా తరలిరావడం.. ఎండలో సైతం కదలకుండా కూర్చోవడం పార్టీ విజయానికి సంకేతమని టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. సీఎం పర్యటనతో శ్రేణులు ఫుల్‌జోష్‌లో ఉన్నారు. గుడివాడలో అవినాష్‌ విస్తృత ప్రచారం చేస్తున్నారు. నేతలందరూ కలసికట్టుగా ఆయన విజయానికి కృషి చేస్తున్నారు. గుడివాడలో వైసీపీకి ఎదురేలేదని ఆ పార్టీ నేతలు ఇప్పటివరకు ప్రగల్బాలు పలుకుతూ […]

రాజంపేట లో గెలుపెవరిది..?

రాజంపేట.. రాష్ట్రంలోనే సంక్లిష్టమైన లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒకటి. కడప, చిత్తూరు జిల్లాల్లో విస్తరించిన ఈ నియోజకవర్గంలో.. వ్యక్తుల ప్రాబల్యం, పార్టీల ప్రభావం, వాటికి సమాంతరంగా సామాజిక వర్గాలు కీలక పాత్ర పోషిస్తాయి. సామాజికవర్గాల అండతో పాటు పుష్కల ఆర్థిక వనరులతో డీఏ సత్యప్రభ(టీడీపీ), పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి (వైసీపీ) బరిలోకి దిగారు. రెండు వర్గాలకు చెందిన వీరి పోరు రసవత్తరంగా మారింది. రాజంపేట లోక్‌సభ నియోజకవర్గంలో కడప జిల్లాకు చెందిన రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి అసెంబ్లీ సీట్లు.. […]

న‌ర‌సాపురం ప్ర‌జ‌ల పెద‌వి విరుపు: ఆ రెండు పార్టీలు వ‌ద్దు.. టీడీపీ ముద్దు

ఎన్నిక‌ల స‌మ‌యంలో నాయ‌కులు వేస్తున్న ఎత్తులు, జిత్తులు అన్నీ కావు. అధికారంలోకి రావ‌డం, గెలుపు గుర్రం ఎక్క డ‌మే ల‌క్ష్యంగా నాయ‌కులు అడుగులు వేస్తున్నారు. ఏం చేసైనా స‌రే.. తాము విజ‌యం సాధించాలి. అనే ల‌క్ష్యంతో పార్టీ లు నాయ‌కులు కూడా దూసుకుపోతున్నారు ఈ నేప‌థ్యంలో ఎవ‌రు ఎలాంటి వారు? ఎవ‌రు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉ న్నారు? ఎవ‌రు ప్ర‌భుత్వం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధికి బాట‌లు ప‌రిచింది? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ప్ర‌తి ఒ […]