టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు భారీ షాక్

టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సోదరుడు బుద్దా నాగేశ్వరరావు వైసీపీలో చేరారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పాదయాత్రలో ఉన్న జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బుద్దా వెంకన్న బీసీల కోసం ఎప్పుడూ పోరాడలేదన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. వైసీపీలో చేరేందుకు మరికొందరు బీసీ నేతలు సిద్ధంగా ఉన్నారని బుద్దా నాగేశ్వరరావు చెప్పారు.