టీడీపీపై వైసీపీ విష ప్రచారం

పార్టీల మేనిఫెస్టోలు, అభ్యర్థుల ప్రకటనలు, ప్రచారం చేసుకోవడాలు.. కానీ ఇప్పుడు తెరవెనుక వ్యూహాలు కీలకం. ఆ తెరవెనుక వ్యూహాలు కూడా ఓట్లు వేయించుకోవడం కాదు. ప్రత్యర్థపార్టీని ఎలా దెబ్బతీయాలి. ఎక్కడెక్కడ బలంగా ఉన్న అభ్యర్థులు, ప్రధాన అనుచరులను లాగేయాలి. సర్వేలపేరుతో కాన్ఫిడెన్స్‌ను ఎలా తగ్గించాలి. పెద్ద నేతలు పార్టీ మారబోతున్నారన్నసూచనలు ఎలా పంపాలన్నరేంజ్‌లో ఈ మైండ్ గేమ్ ఉంటోంది. ఈ మైండ్ గేమ్‌లో ఎవరిది పైచేయి. ఏపీలో వైసీపీ, టీడీపీ ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి చేస్తున్నాయి.

‘ఆ పార్టీ నుంచి పెద్ద తలకాయ మా పార్టీలోకి వస్తారు? ఆయన కోసమే ఆ సీటు ఖాళీగా ఉంచాం. ఇదిగో సర్వే సంచలనం విజయం మా పార్టీదే’.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో రెండు పార్టీల మధ్య నడుస్తున్న మైండ్ గేమ్‌లో ఇదే కీలకం. ప్రధానంగా ఈ మైండ్ గేమ్ కోసం ప్రత్యేకమైన నెట్ వర్క్‌ను వైసీపీ నడుపుతోందని వైసీపీ నేతలంటున్నారు. జగన్ ప్రవర్తన కారణంగానూ, వైసీపీ ఆశలు లేని కారణంగానూ ఆ పార్టీ నుంచి బలమైన నేతలంతా గత నాలుగేళ్ల కాలంలో దూరం జరిగిపోయారు. సీనియర్ కొంతమంది ఉన్నా జగన్ వారిని పరిగణలోకి తీసుకోరు. దాంతో జగన్ తర్వాత ఎవరు? అన్నప్రశ్న వస్తే ఆ పార్టీలో సమాధానమే లేదు. అయితే ఎన్నికల సమయంలో పోటీలకు సీనియర్లు, సమర్థులు, ప్రజాబలం ఉన్నవారు కావాలి కాబట్టి బీహార్‌కు చెందిన కన్సాల్టెంట్ ప్రశాంత్ కిషోర్‌ను పెట్టుకుని మైండ్ గేమ్ ద్వారా నేతలను తన పార్టీలోకి ఆహ్వానించాలని జగన్ ప్లాన్ చేశారని చెబుతున్నారు.