నగరి టీడీపీ టికెట్‌కు డాక్టర్‌ అభ్యర్థన

నగరి నియోజకవర్గ ప్రజలకు గత 30 ఏళ్లుగా వైద్య సేవలు అందిస్తూ ప్రజాభిమానం, కుల బలం ఉన్న తనకు పార్టీ టికెట్‌ కేటాయిస్తే తప్పకుండా గెలుపు సాధిస్తానని పుత్తూరులోని సుభాషిణి ఆస్పత్రి యజమాని డా. సుభాషిణి సీఎం చంద్రబాబును కలసి దరఖాస్తు ఇచ్చారు. శుక్రవారం అమరావతిలో సీఎంని కలసి ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారి పని చేస్తూ టీడీపీ పార్టీ అమలు చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితురాలై ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చానని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ఆదివారం వెళ్లి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నానని తెలిపారు. డాక్టర్‌గా, తటస్తురాలిగా తనకు టికెట్‌ ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని కోరారు.