సెక్స్ కోర్కెలు పెర‌గాలంటే ఇలా చేయండి….

భార్య భర్తలకు శృంగారానికి చాలా దగ్గర సంబంధం ఉంది. భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య స‌రైన దాంప‌త్య జీవితం లేక‌పోతే వారి జీవితంలో ఎన్నో చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారి జీవితంలో ఆనంద‌మే ఉండ‌దు. ప్ర‌తి రోజు సెక్స్‌లో పాల్గొని, ఆరోగ్య‌క‌ర‌మైన సెక్స్ ఎంజాయ్ చేసే దంప‌తులు ఎంతో అన్యోన్యంగా ఉంటార‌ని కొన్ని అధ్య‌య‌నాల్లో తేలింది. ఆరోగ్య‌క‌ర‌మైన సెక్స్ మాన‌వ‌జీవ‌న మ‌నుగ‌డ‌తో పాటు ధీర్ఘాయుష్యు క‌ల‌గ‌చేస్తోంద‌ట‌. దీని వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు దూరం అవ్వ‌డంతో పాటు సంత‌నా స‌మ‌స్య‌లు కూడా ఉండ‌వు.

అయితే రోజు రోజుకు మాన‌వుడిపై విప‌రీత‌మైన ప్రెజ‌ర్ పెరిగిపోతోంది. ఒత్తిళ్ల‌తో కూడిన జీవనం వ‌ల్ల మాన‌వుడు స‌రిగా సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేయ‌లేక‌పోతున్నారు. ఏదో సెక్స్ చేయాలి కాబ‌ట్టి మ‌మ అని పించేస్తున్నారు. ఇలా లైంగీక కోరిక‌లు త‌గ్గిపోవ‌డాన్ని, లేక‌పోవ‌డాన్ని వైద్య ప‌రిభాష‌లో లాస్ ఆఫ్ లిబిడో అంటారని తెలిపారు. ఈ లైంగీక కోరిక‌లు త‌గ్గిపోవ‌డం యుక్త వ‌య‌స్సులోనే ఎక్కువుగా జ‌రుగుతుంటే అది ఆందోళ‌న చెందాల్సిన విష‌య‌మే అంటున్నారు సెక్సాల‌జిస్టులు.

యుక్త‌వ‌య‌స్సులో యువ‌త పెళ్లి విష‌యంలో లేట్‌గా డెసిష‌న్ తీసుకుంటున్నారు. చ‌దువు, ఉద్యోగం, ఆర్థిక ప‌రిపుష్టి నేప‌థ్యంలో మ‌హిళ‌ల‌కు కూడా 30 ఏళ్లు వ‌స్తేగాని పెళ్లికావ‌డం లేదు. ఆ వ‌య‌స్సులో చాలా మందికి లైంగీక వాంచ‌లు ఉండ‌డం లేదు. ఈ ఎఫెక్ట్ వ‌ల్ల చాలా మందిలో సంతానోత్ప‌త్తి విష‌యంలో ఇబ్బందులు ఏర్ప‌డుతున్నాయి. కాబట్టి దంపతులు ఆరోగ్యకరమైన శృంగారంలో పాల్గొనాలని..అందుకోసం కొన్ని ఆహార పదార్ధాల్ని తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.

మ‌న శ‌రీరంలో డీ విట‌మిన్ త‌గ్గితే సెక్స్‌పై ఆస‌క్తి త‌గ్గుతుంది. పుట్టగొడుగులు, కార్న్ ఫ్లేక్స్, ముయెస్లీ, గుడ్లు, మెకెరెల్, తృణధాన్యాలతో డీ విటమిన్ పెరుగుతుంది. వెల్లుల్లిలో అనిలిసిన్ సెక్స్ కోరికల్ని పెంచుతుంది. భార్యభర్తలు ఎవరైనా సరే లైంగిక వాంచను పెంచుకోవాలంటే వెల్లుల్లిని తప్పనిసరిగా ఆహారంలో తీసుకోవాలి. అప్పుడే రక్తప్రసరణ జరిగి..మీలో ఉన్న కోరికలు గుర్రాలై పరిగెత్తుతాయి. ఇక డార్క్ చాక్లెట్ల‌లో ఉన్న ఆమ్లజనకాలు మనలో ఉన్న ఒత్తిడిని తగ్గించి సెక్స్ కోరిక పెంచుతుంది. పాలకూర వ‌ల్ల శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. వీటితో పాటు సెక్స్ కోరికలు పెరుగుతాయి. పాలకూర తిన్నప్పుడు యోనిలో రక్తప్రసరణ బాగా జరిగి శృంగారంపై మోజు పెరుగుతంది. ఇక గుడ్ల‌లో ఉన్న అర్జినైన్ అనే రసాయనం సెక్స్‌ కోరికల్ని పెంచుతుంది.