శృంగారానికి మూడ్ వ‌చ్చే వారాలు తెలుసా ?

శృంగారానికి వారాల‌కు కూడా లింక్ ఉంద‌ట‌. విన‌డానికి ఇది కాస్త ఆశ్చ‌ర్యంగా ఉన్నా నిజమేఅట‌. మ‌న‌దేశంలో ఫ‌స్ట్ నైట్‌కు కూడా ముహూర్తాలు చూసి సెట్ చేస్తుంటారు. ఇక ఫ‌స్ట్ నైట్ సంగ‌తి ప‌క్క‌న పెడితే మిగిలిన రోజుల్లో కూడా సెక్స్‌కు వారాల‌కు లింక్ ఉంద‌ట‌. ఈ విష‌యం ఓ సంస్థ చేసిన స‌ర్వేలో వెల్ల‌డైంది. శృంగారంలో ఎప్పుడు పాల్గొనాలి, ఏరోజున మంచిది లాంటి విషయాలపై ఓ సంస్థ సర్వే నిర్వ హించింది. ఈ సర్వేలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

శృంగార బొమ్మలు తయారుచేసే లవ్‌ హనీ అనే ఓ సంస్థ సుమారు మూడువేల మందిపై సర్వే నిర్వ హించింది. ఆ సర్వే ప్రకారం వారంలో మిగిలిన రోజులతో పోలిస్తే 44 శాతం మంది దంపతులు శని, ఆదివారాల్లోనే శృంగారాన్ని ఎక్కువగా ఇష్ట పడుతున్నట్టు తేలింది. ఆదివారం 16 శాతం మంది, శుక్రవారం 23 శాతం మంది శృంగారానికి ఆసక్తి చూపుతున్నారట. ఆదివారం సాయంత్రం సెల‌వు కావ‌డంతో శ‌నివారం రాత్రి కాగానే చాలా మంది ప‌క్క‌మీద‌కు చేరిపోయి సెక్స్‌లో ఎంజాయ్ చేసేందుకు రెడీ అవుతార‌ట‌.

శనివారం సాయంత్రం 7.30 గంట‌ల‌కు సెక్స్ ఎంజాయ్‌మెంట్‌కు స‌రైన టైంగా చాలా మంది దంప‌తులు భావిస్తార‌ట‌. ఇక ఉదయం నిద్రలేచే సమయంలో పురుషుల్లో శృంగార కోరికలు ఎక్కువగా ఉంటున్నాయట. పని ఒత్తిడి కారణంగా, తెల్లవారుజామున సెక్స్‌ చేయడానికి కేవలం పదిశాతం మంది మాత్రమే సిద్ధపడుతున్నారట.

అన్నింటికన్నా మంగళవారం రోజున అతితక్కువ మంది శృంగారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారట. దాని తర్వాత స్థానంలో గురువారం ఉంది. మిగిలిన వారాలైన సోమవారం రోజు 8 శాతం మంది బుధవారం నాడు 7 శాతం మంది శృంగారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారట. పైగా శృంగార కోరికలనేవి వేసవి కాలంలో ఎక్కువగా కలుగుతున్నాయని వారు నిర్వహించిన పరిశోధనలో తేలింది. వారానికి నాలుగుసార్లు శృంగారం జరిపే దంపతులు తమ సహజమైన వయస్సుకన్నా పదేళ్ళు చిన్నవారిగా కనిపిస్తారని కూడా ఈ పరిశోధనలో తేలింది.