తిరువూరులో గెలిచేది ‘ జ‌వ‌హ‌ర్‌ ‘… ఎగిరేది టీడీపీ జెండాయే…!

రాజకీయాల్లో గెలుపోటములు సహజం అంటారు…కానీ కృష్ణా జిల్లా తిరువూరులో టీడీపీ ఓటమి సహజం అయిపోయింది. అది కూడా అక్కడ టీడీపీ అభ్యర్ధి నల్లగట్ల స్వామీదాసు స్వయంకృతాపరాధమం వలనే. 1994, 99ల్లో వరుసగా గెలిచిన స్వామీదాసు… 2004, 09, 14లలో జరిగిన ఎన్నికల్లో వరుసగా ఓడిపోయి హ్యాట్రిక్ కొట్టారు. అందులోనూ 2009 265 ఓట్లు, 14లో 1600 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. దీంతో టీడీపీ శ్రేణులు ఢీలా పడిపోయాయి. ఈ క్రమంలోనే మంత్రిగా, ఫైర్ బ్రాండ్‌గా రాష్ట్రానికి సుపరిచితమైన వ్యక్తి అయిన జవహర్‌ని టీడీపీ అధినేత చంద్రబాబు తిరువూరు బరిలో దించారు. గత ఎన్నికల్లో వెస్ట్ గోదావరి కొవ్వూరు నుండి గెలిచి మంత్రి అయ్యారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ తన శాఖాకి పూర్తి న్యాయం చేశారు. ఇక ప్రత్యర్ధులు ఏదైనా విమర్శలు చేస్తే అందరికంటే ముందుగా స్పందించి వారికి కౌంటర్లు ఇస్తూ ఫైర్ బ్రాండ్‌గా ఉన్నారు.

ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా అందటంతో పాటు ప్రజల నుంచి వచ్చిన వినతులు పరిష్కారించి తక్షణమే ఆన్ లైన్ చేయడంలో జవహర్ మంచి మార్కులు కొట్టేశారు. ఇలా ప్రజల సమస్యల పరిష్కరించడంలో ముందున్న జవహర్‌ని తిరువూరు తీసుకొచ్చారు. ఈసారి ఇక్కడ ఎలా అయిన గెలవాలనే పట్టుదలతో ఉన్న సీఎం జవహర్ అయితేనే సరైనా అభ్యర్ధి అని భావించి ఇక్కడ పోటీ చేయిస్తున్నారు. ఇప్పటికే జవహర్ అభ్యర్ధిత్వం ఖరారు కావడంతో…ఆయన ప్రచార బరిలోకి దిగేశారు. ఇక ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్‌కు మంత్రితో కలిసి పార్టీ విజయానికి కృషి చేయాల అధినేత సర్దిచెప్పినట్లు తెలిసింది. ఆయనకు సమాన పదవి ఇచ్చేందుకు హామీ లభించినట్లు తెలుస్తోంది.

ఇక జవహర్ రాకతో తిరువూరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టీడీపీ క్యాడర్ కూడా ఇక్కడ గట్టిగానే ఉంది. అలాగే ప్రభుత్వం సంక్షేమ పథకాలు టీడీపీని గెలిపిస్తాయని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. పైగా గత ఎన్నికల్లో టీడీపీ ఎస్సీల మద్ధతు కొంత కోల్పోయింది. అయితే ఈసారి పరిస్తితి అలా ఉండదని అర్ధమవుతుంది. జవహర్‌కి వారు పూర్తి మద్ధతు తేలేపేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక ఎలాగో బీసీ, కమ్మ ఓటర్లు ఎక్కువ టీడీపీకి మద్ధతు ఇస్తారు. అలాగే ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్న కాపులు కూడా టీడీపీ వైపే ఉన్నారు. మొత్తానికి ఈ పరిణామాలన్నీ జవహర్ విజయానికి కృషి చేస్తాయని టీడీపీ శ్రేణులు గట్టిగా నమ్ముతున్నాయి. ఏది ఏమైనా ఈ సారి ఇక్కడ టీడీపీ విజయం గెలవడం ఖాయంగా కనపడుతోంది.