ఆ గొప్పదనం టీడీపీదే

రాష్ట్రంలో ప్రజల వద్దకు పాలన తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పోలూరు గ్రామంలో ఎంపీడీవో విజయభాస్కర్‌ అధ్యక్షతన జన్మభూమి – మాఊరు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఎమ్మెల్యే ప్రసంగిస్తూ ప్రజలకు పారదర్శకమైన, అవినీతి రహిత సేవలను అందించడమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని అన్నారు. సీఎం చంద్రబాబు నవ్యాంధ్ర సంక్షేమం కోసం కేంద్రంతోనే తలపడి దేశస్థాయిలో ఒక నిబబ్ధత కలిగిన ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మరోసారి పట్టం కట్టాలని ఎమ్మెల్యే పిలుపు నిచ్చారు. అనంతరం డిజిటల్‌ పాసుపుస్తకాలు, చంద్రన్న కానుకలు, చుక్కల భూములకు పట్టాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. గర్భిణులకు సీమంతాలు, బాలామృతం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జన్మభూమి ఇన్‌చార్జి అనూరాధ, తహీసల్దార్‌ జయరామిరెడ్డి, ఎంపీపీ ప్రభాకర్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మహానంది, జనవరి 9: రాష్ట్రంలో శాశ్వత అభివృద్ధి పనులు చేస్తుంటే ప్రతిపక్ష నాయకులు ఓర్వలేక అవినీతి జరిగిందంటూ విమర్శించడం శోచనీయమని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. బుధవారం జన్మభూమి -మాఊరులో భాగంగా బుక్కాపురంలో జరిగిన గ్రామసభలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నోడల్‌ అధికారి బ్రహ్మం ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ పేదల కోసం పుట్టిందని అన్నారు. వర్షాలు లేకున్నా తెలుగుగంగ ప్రధాన కాల్వ ద్వారా పంట పొలాలకు నీరు అందించామని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 10 తేదీ వరకు నియోజకవర్గంలో తాగునీరు అందిస్తామని చెప్పారు. శిల్పా బ్రదర్స్‌ రెండు సార్లు ప్రజాప్రతినిధిగా ఎంపికైనా అభివృద్ధి చేయలేదని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. సాయంత్రం గ్రామదర్శినిలో ఎమ్మెల్మే బుడ్డా తమ్మడపల్లెలో పర్యటించి ఎస్‌ఐ కాలనీలో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం బుక్కాపురంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జన్మభూమి రాష్ట్ర ప్రత్యేకాధికారి వెంకట్రామిరెడ్డి, ఎంపీపీ నాగమణి, తహసీల్దార్‌ సుబ్బరాయుడు, ఎంపీడీవో నరసింహ, వైద్యాధికారి చంద్రశేఖర్‌, వ్యవసాయాధికారి సుబ్బారెడ్డి, హౌసింగ్‌ ఏఈ షఫీవుల్లా, టీడీపీ నాయకులు రామలింగారెడ్డి, పాణ్యం ప్రసాదరావు, కందుల రఘురామిరెడ్డి, కేశవరావు, అధికారులు పాల్గొన్నారు.

బండి ఆత్మకూరు, జనవరి 9: జన్మభూమిలో సమస్యలు పరిష్కారం అవుతున్నాయని నోడల్‌ ఆఫీసర్‌ మురళీకృష్ణ, తహసీల్దార్‌ వెంకటలక్ష్మి, ఇన్‌చార్జి ఎంపీడీవో మహేశ్వరరెడ్డి అన్నారు. మండలంలోని ఏకోడూరు, పార్నపల్లె గ్రామాలలో బుధవారం జన్మభూమి -మాఊరు కార్యక్రమాలు నిర్వహించారు. పార్నపల్లెలో సీపీఎం నాయకుడు రత్నమయ్య దళిత, శిల్పా, ఏరాసు నగర్‌లలో సమస్యలను ఎన్ని జన్మభూ మి కార్యక్రమాలలో వివరిస్తున్నా పరిష్కారం కాలేదన్నారు. ఏ కోడూరులో దిగుడు బావి దుర్ఘంధంగా మారిందని అధికారులకు తెలిపినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఈ కార్యక్రమాలలో ఏవో నాగేశ్వరరెడ్డి, ఏఈలు వాసుదేవుడు, రామచంద్రాచారి, ఏపీవో రామేశ్వరమ్మ, ఏపీఎం రాజశేఖర్‌రెడ్డి, డాక్టర్లు నటరాజు, సునీత, కృష్ణమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

జన్మభూమి -మాఊరులో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని నోడల్‌ అధికారి నాగరాజు అన్నారు. బుధవారం పసురపాడు, నాగులవరం గ్రామాలలో జన్మభూమి జరిగింది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎంఈవో అబ్దుల్‌ కరీం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సమర్థవంతమైన విద్యాబోధన జరుగుతుందని, 10వ తరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నామన్నారు. పొదుపు మహిళలకు రుణాలు, విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుగుణశ్రీ, తహసీల్దార్‌ పద్మనాభరావు, పశువైద్యాధికారి బాలవెంకట్‌, ఏఈ భాస్కర్‌, ఏవో సుధాకర్‌, ఈవోఆర్డీ నాగేంద్ర,డీటీ రామనాథ్‌రెడ్డి, ఆర్‌ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు.

పాణ్యం, జనవరి 9: ప్రజా సమస్యల పరిష్కారానికి జన్మభూమి కార్యక్రమం వేదికగా నిలుస్తుందని పాణ్యం నోడల్‌ అధికారి ఫిరోజ్‌ ఖాన్‌ అన్నారు. బుధవారం పిన్నాపురంలో జరిగిన జన్మభూమిలో ఆయన మాట్లాడుతూ రెవెన్యూ, విద్య, వైద్య, వ్యవసాయ, విద్యుత్‌ సమస్యలపై సంబంధిత అధికారులతో నేరుగా మాట్లాడి సమస్యలు సరిష్కరించుకోవచ్చునన్నారు. రేషన్‌ కార్డుకు దరఖాస్తు చేసుకున్న రెండు రోజులకే మంజూరు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జన్మభూమి నివేదికలు ఆవిష్కరించారు. సంక్రాంతి కానుకలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ నూకరాజు, ఈవోఆర్డీ రమణ, ఏఈ రామయ్య, లక్ష్మయ్య, కందికాయపల్లెలో జరిగిన జన్మభూమిలో ఎంపీడీవో ఆదయ్య, ఎంఈవో కోటయ్య, ఏవో ఉషారాణి, డీటీ రామచంద్రారావు, ప్రజలు పాల్గొన్నారు.