ఉంగుటూరు ద‌శ దిశ మార్చిన ‘ గ‌న్ని ‘…. ఐదేళ్లు @ 1352 కోట్లు

ఎన్నిక‌ల వేళ ప్ర‌జ‌ల ప‌ల్స్ ప‌ట్టుకోవ‌డం చాలా క‌ష్ట‌మ‌ని అంటారు. కానీ, నిత్యం ప్ర‌జ‌ల కోసం, నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండే నాయ‌కుల‌కు ప్ర‌జ‌లు ఎప్పుడూ బ్ర‌హ్మ‌ర‌థం ప‌డ‌తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. త‌మ‌కు అభివృద్ధి చేసే నాయ కుడు కావాలని, త‌మ‌ను నిత్యం అభివృద్దిదిశ‌గా న‌డిపించే నాయ‌కుడు కావాల‌ని కోరుకుంటార‌న‌డంలో ఎలాంటి సందే హం లేదు. ఇప్పుడు అలాంటి ప‌రిణామ‌మే మ‌న‌కు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం ఉంగుటూరులో క‌నిపిస్తోంది. గత ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన గ‌న్ని వీరాంజ‌నేయులు విజ‌యం సాధించారు. అయితే, గెలిచాం క‌దా.. మ‌ళ్లీ ఐదేళ్ల‌కు క‌దా.. ఎన్నిక‌లు అని ఆయ‌న ఎక్క‌డా విశ్ర‌మించ‌లేదు.

నిత్యం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్నారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుసుకున్నారు. న‌న్ను గెలిపించిన మీకు ప్ర‌తి క్ష‌ణం సేవ చేసుకుంటాను అంటూ ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుసుకుని ముందుకు సాగారు. అదే స‌మ‌యం లో నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్ని రూపాల్లోనూ అభివృద్ధి చేశారు. ప్ర‌భుత్వంతో నిత్యం ట‌చ్‌లో ఉంటూ.. నియోజ‌క‌వ‌ర్గానికి ఉన్న ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌ను వివ‌రించి భారీ మొత్తంలో నిధులు స‌మీక‌రించారు. ప్ర‌తి రూపాయినీ అత్యంత పార‌ద‌ర్శ‌కంగా ఖ‌ర్చు చేశారు. ఐదేళ్ల కాలంలో రూ. 1352 కోట్ల నిధుల‌ను రాబ‌ట్టి నియ‌జ‌క‌వ‌ర్గంలో 2014కు ముందు త‌ర్వాత అనే రేంజ్‌లో ప్ర‌తి వార్డును, ప్ర‌తి వీధినీ బాగు చేశారు. దాదాపు 300 కిలోమీట‌ర్ల సిమెంటు రోడ్లు నిర్మాణం చేప‌ట్టి రికార్డు సాధించారు. అప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ ప్ర‌జ‌ల ఓట్లు వేయించుకున్న నాయ‌కులు కేవ‌లం ప్ర‌జ‌లను ఓట‌ర్లుగానే చూశారు త‌ప్ప‌.. గ‌న్నిలా ప్ర‌జల్లా గుర్తించ‌లేద‌నే పేరు తెచ్చుకున్నారు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌లో ర‌హ‌దారుల విష‌యంలో గ‌త యాభై ఏళ్ల అభివృద్ధి ఒక వైపు…. గ‌త ఐదేళ్ల అభివృద్ధి ఒక వైపుగా నిలిచింది. ఇక‌, అన్ని రూపాల్లోనూ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఫ‌స్ట్‌లో ఉండేలా నిలిపారు. సంక్షేమ ఫ‌లాల‌ను ప్ర‌జ‌ల‌కు అందించ‌డంలోను, పింఛ‌న్లు అందించ‌డంలోనూ ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి నుంచి పేద‌ల‌కు ఆర్థికంగా సాయం చేయించ‌డంలోనూ గ‌న్ని త‌న విశిష్ట‌త‌ను చాటుకున్నారు. ఈ స‌హాయ నిధి ద్వారా ఎక్కువ మందికి ల‌బ్ధి క‌లిగేలా చేయ‌డంలో కూడా ఆయ‌న ఏపీలోనే టాప్ ర్యాంకులో నిలిచి సీఎం ప్ర‌శంస‌లు అందుకున్నారు. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో ఇంటింటికీ మ‌రుగుదొడ్డి నిర్మించారు. ప్ర‌తి ఇంటికీ కుళాయిలు ఏర్పాట‌య్యేలా ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకున్నారు. ఇలా ఈ ఐదేళ్లు.. ఆయ‌న నిత్యం ప్ర‌జ‌ల మ‌నిషిగానే జీవించారు. సొంత లాభం ఎంతో మానుకుని ప్ర‌జ‌ల మ‌నిషిగానే గుర్తింపు సాధించారు. ఈ క్ర‌మంలోనే మ‌రోసారి ప్ర‌జాక్షేత్రంలో ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు పొందే క్ర‌మంలో దూసుకు పోతున్నారు.