వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను మాజీ సీఎం సంచలన ప్రకటన

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని మాజీ సీఎం సిద్దరామయ్య స్పష్టం చేశారు. ఢిల్లీలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనన్నారు. జేడీఎస్‌తో పొత్తు ఉంటుందని తద్వారా 20 సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెలలోనే సీట్ల సర్దుబాటుతో పాటు ఇతర అంశాలపై చర్చలు జరుపుతామన్నారు. కనీసం నాలుగైదుసార్లు భేటీ అయ్యే అవకాశం ఉందన్నారు. రాష్ట్రం నుంచి ఎక్కువ స్థానాలు సాధించడమే తమ లక్ష్యమన్నారు.