వైరల్ వీడియో…తడబడిన వైసీపీ మహిళా నేత.. ఉలికిపడ్డ నేతలు..

వైసీపీ నేతల మాట తడబడింది. పెద్దాపురం పట్టణంలోని గోలివారి వీధిలో పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నియోజకవర్గ పార్టీ పరిశీలకురాలు పోలి విజయలక్ష్మి మాటలు తడబడ్డారు. దీంతో ఒక్కసారిగా వైసీపీ నాయకులు నాలుక కరుచుకున్నారు. అదే సమయంలో అక్కడున్నవారు అవాక్కయ్యారు. ‘పెద్దాపురం నియోజకవర్గంలో కొండను ఢీకొట్టినట్లు డిప్యూటీ సీఎంను అధిక మెజార్టీతో నెగ్గించినట్లయితే ప్రజలు సంతోషంగా ఉంటారు’ అని ఆమె మాటలు తడబడ్డారు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. దీంతో అక్కడున్న నేతలు ఆమె మాటలకు ముక్కున వేలేసుకున్నారు. ఆ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయడంతో వైసీపీ నాయకులు ఢీలా పడ్డారు.