విశాఖ ఎంపీ స్థానంలో యువనేతకు జై..!

విశాఖ ఎంపీ స్థానానికి ఉన్న పోటీ అంతా ఇంతా కాదు. హేమాహేమీలు ఇక్క‌డ నుంచి పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా యు వ నాయ‌కుడు ఈ వ‌రుస‌లో ఉండ‌డం ఇప్పుడు అంద‌రినీ ఆక‌ర్షిస్తున్న ప్ర‌ధాన విష‌యం. ప్ర‌ధాన పార్టీలు వైసీపీ, టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన‌లు కూడా ఇక్క‌డ బ‌ల‌మైన నాయ‌కుల‌నే రంగంలోకి దింపాయి. వైసీపీ త‌ర‌ఫున ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌, బీజేపీ త‌ర‌ఫున మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వ‌రి, జ‌న‌సేన త‌ర‌ఫున జేడీల‌క్ష్మీనారాయ‌ణ వంటి హేమాహేమీలు త‌ల‌ప‌డు తున్నారు. అయితే, వీరితోపాటు అధికార పార్టీ టీడీపీ అభ్య‌ర్థిగా రంగంలోకి దిగారు గీతం విద్యాసంస్థ‌ల అధినేత‌, దివంగ‌త గీతం మూర్తి మ‌న‌వ‌డు శ్రీభ‌ర‌త్‌.

న‌వ‌యువ‌కుడు కావ‌డం, రాజ‌కీయాల్లో కొత్త‌గా అడుగులు వేయ‌డం వంటివి ఇక్క‌డ భ‌ర‌త్‌కు ఆక‌ర్ష‌ణ‌గా మారాయి. ప్ర‌తి ఒ క్కరూ ఆయ‌న‌ను ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. ఇక్క‌డ నుంచి పోటీ చేస‌తున్న వారిలో అత్యంత పిన్న‌వ‌య‌స్కుడు కూడా అయిన భ‌ర‌త్‌కు విద్య ప‌రంగా అనేక రికార్డులు ఉన్నాయి. అదేస‌మ‌యంలో.. రాజ‌కీయంగా త‌న తాత మూర్తి, మామ బాల‌కృష్ణ‌ల వార‌స‌త్వం పుష్క‌లంగా క‌నిపిస్తోంది. పైగా గీతం యూనివ‌ర్సిటీ అంటేనే ద‌క్షిణాదిలోనే కాకుండా దేశంలోనూ మంచి పేరు సంపాయించుకుంది. ఈ విద్యాసంస్థ‌ల‌కు క‌రెస్పాండెంట్‌గా ఉన్న శ్రీభ‌ర‌త్‌కు అనూహ్య‌మైన పాపులారిటీ వ‌చ్చింది.

ఇక‌, ఇప్పుడు విశాఖ వంటి అత్యంత కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గానికి ఆయ‌న పోటీ ప‌డుతుండ‌డంతో మేధావుల చూపు ఆయ న‌పైనే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అదేస‌మ‌యంలో ఇక్క‌డ నుంచి పోటీ చేస్తున్న‌వారిలో బీజేపీ నాయ‌కురాలు పురందేశ్వ‌రికి పెద్ద‌గా ఫాలోయింగ్ క‌నిపించ‌డం లేదు. గ‌తంలో ఆమె ఇక్క‌డ నుంచి గెలిచి కేంద్రంలో మంత్రిగా కూడా చ‌క్రం తిప్పారు. అయినా ఇక్క‌డి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌లేద‌నే అప‌వాదును మూట‌గ‌ట్టుకున్నారు. పైగా ఆయ‌న స్థానికురాలు కాదు. ఇక‌, జ‌న‌సేన త‌ర‌ఫున పోటీ చేస్తున్న జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ కూడా స్థానికేత‌రుడు. పైగా ఆయ‌నకు రాజ‌కీయ అనుభవం పెద్ద‌గా లేదు. ఇక‌, వైసీపీ త‌ర‌ఫున పోటీ చేస్తున్న స‌త్య‌నారాయ‌ణ కూడా ప్ర‌భావం చూపే అవ‌కాశం లేదు. దీంతో యువ‌నేత‌గా శ్రీభ‌ర‌త్ అన్ని విధాలా విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.