ఉంగుటూరు అభివృద్ధి.. 2014కు ముందు త‌ర్వాత‌.. ఓపెన్ ఛాలెంజ్‌

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఉంగుటూరు నియోజ‌క‌వ‌ర్గం రాష్ట్రంలోనే అభివృద్ధి ప‌రంగా ముందున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో టాప్ ర్యాంక్‌లో ఉందా ? ఇక్క‌డి ఎమ్మెల్యే గ‌న్ని వీరాంజ‌నేయులు కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారా? అటు పార్టీలోను, ఇటు ప్ర‌జ‌ల్లోనూ ఆయ‌న‌కు మంచి మార్కులు ప‌డుతున్నా యా? ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబు వ‌ద్ద మంచి మార్కులు ఉన్నాయా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు తిరుగు ఉండ‌ద‌నే ప్ర‌చార‌మే పార్టీల‌కు అతీతంగా సాగుతోంది. వాస్త‌వానికి ఉంగుటూరు అభివృద్ధిని చూసుకున్నా కూడా ఇదే మ‌న‌కు క‌నిపిస్తోంది. 2014కు ముందు ఇక్క‌డ ఎన్నికైన ప్ర‌జా ప్ర‌తినిధుల కంటే కూడా గ‌న్ని అభివృద్ధిలో దూసుకుపోతున్నారు. ప్ర‌తి విష‌యాన్ని కూలంక‌షంగా ప‌రిశీలించ‌డం, ప్ర‌తి విష‌యాన్ని ఆలోచించి అడుగులు వేయ‌డం గ‌న్ని స్పెషాలిటీ. నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి మండ‌లం, గ్రామాన్ని సంద‌ర్శించి ఆయా స‌మ‌స్య‌ల‌ను ఆక‌ళింపు చేసుకుని వాటి ప‌రిష్కారానికి గ‌న్ని ఎంతో కృషి చేశారు.

ముఖ్యంగా పేద‌లకు ప్ర‌భుత్వ ఫ‌లాలు అందించ‌డం లోనూ ఆయ‌న ముందున్నారు. ప్ర‌భుత్వం నుంచి నిధులు తెచ్చుకోవ‌డంలోను, పార్టీని స‌మ‌న్వ‌యం చేసుకోవ‌డంలో నూ ఆయ‌న వ్యూహాత్మ‌కంగా అడుగులు వేశారు. ప్ర‌జ‌లే ముందు నినాదంలో ముందుకు సాగాల‌న్న పార్టీ అధినేత చంద్ర‌బాబు వ్యూహానికి అనుగుణంగా ఆయ‌న ముందుకు వెళ్లారు. ప్ర‌తి విష‌యంలోనూ ఆయ‌న దూసుకుపోయారు. అన్నింటికీ మించి ఆయ‌న చేస్తున్న అభివృద్ధి తాలూకు ముఖ చిత్రాన్ని నియోజ‌క‌వ‌ర్గంలో ఫ్లెక్సీల రూపంలో ప్ర‌జ‌ల ముందు ఉంచారు. ఏ రూపాయికి ఎంత ప‌నిచేశారో వివ‌రించారు. ఫ‌లితంగా రాష్ట్రంలోని మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల కంటే కూడా అత్యంత పార‌ద‌ర్శకంగా ప్ర‌జ‌ల కుసేవ చేస్తున్న నాయ‌కుడిగా ఆయ‌న గుర్తింపు పొందారు. దాదాపు 250 కిలోమీట‌ర్ల‌కు పైగా సీసీ రోడ్ల‌ను నిర్మించారు. అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ ప్ర‌భుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను చేరువ చేశారు.

ఇక‌, ఆయ‌న కైక‌రం కేంద్రంగా చేసుకుని నిర్వ‌హించిన ప్ర‌తి స‌భావిజ‌య‌వంతం అయింది. ఇక్క‌డ నిర్వ‌హించిన చంద్ర‌బాబు బహిరంగ స‌భ‌, మినీ మ‌హానాడు, బీసీ స‌ద‌స్సు, పార్టీ స‌భ‌లు దిగ్విజ‌యంగా సాగాయి. దీంతో గ‌న్ని హ‌వా ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో మామూలుగా లేదు. ప్ర‌జ‌ల్లో ఉండే నాయ‌కుడిగా, ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకుని వాటికి అనుకూలంగా అడుగులు వేసే నాయ‌కుడిగా కూడా ఆయ‌న గుర్తింపు పొందారు. తాను ఏం చేయాల‌ని అనుకున్నా అంతిమంగా అది ప్ర‌జ‌ల‌కు ల‌బ్ధి చేకూరేలా చేయ‌డంలో గ‌న్ని ముందున్నారు. ప్ర‌తి విష‌యాన్ని వారికి చెప్పి చేశారు. ప్ర‌జ‌ల ఆశీర్వాదం లేనిదే ఏ కార్య‌క్ర‌మం కూడా హిట్ కాద‌ని న‌మ్మి కులాల‌కు, మ‌తాల‌కు అతీతంగా ఆయ‌న ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకొని ముందుకు సాగారు.

ఈ నేప‌థ్యంలో 2014కు ముందు, త‌ర్వాతఇక్క‌డ జ‌రిగిన అభివృద్ధి , ప్ర‌జ‌ల్లో సంతృప్తి వంటివి ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుం టే.. గ‌న్ని వ‌చ్చిన‌ త‌ర్వాతే ఇక్క‌డ అభివృద్ధి జ‌రిగింద‌నేది నిర్వివాదాంశం. ఈ విష‌యం చంద్ర‌బాబు చేయించిన స‌ర్వేల్లోనే కాకుండా వివిధ పార్టీలు త‌మ‌కు అనుకూలంగా ఉన్న ప‌రిస్తితుల‌పై నిర్వ‌హించిన స‌ర్వేల్లోనూ ఇదే తేలింది. దీంతో గ‌న్నికి ఇక్క‌డ ఎదురు నిల‌బ‌డి మాట్లాడే ప్ర‌త్య‌ర్థి కూడా లేకుండా పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి గ‌న్ని దాదాపు ఆరు మాసాల ముందుగానే మాస్ట‌ర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. కైక‌రంలో నిర్వ‌మించిన మినీ మ‌హానాడులోనే దీనికి ఆయ‌న సంక‌ల్పం చెప్పుకొన్నారు.

ప్ర‌జ‌ల కోసం, ప్ర‌జ‌ల చేత‌, ప్ర‌జ‌ల కొర‌కు- అనే నినాదంతో ఆయ‌న ముందుకు సాగారు. దీని తాలూకు ఫ‌లితం నేడు క‌ళ్ల‌కు క‌ట్టినట్టు క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ అధినేత చంద్ర‌బాబు నిర్వ‌హించి న స‌ర్వేలు. ఆ త‌ర్వాత అనేక వ‌డ‌పోత‌ల అనంత‌రం ఆయ‌న సిద్ధం చేసిన అభ్య‌ర్థుల జాబితాలో గ‌న్ని పేరు తొలి జాబితాలోనే ఉంది. మ‌రో వారం లేదా ప‌ది రోజుల్లోనే వెల్ల‌డించే తొలి అభ్య‌ర్థుల జాబితాలో గ‌న్ని పేరు ఉంద‌న్న సంకేతాలు ఇప్ప‌టికే జిల్లా పార్టీ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ‌కు వ‌చ్చేశాయి. ఎనిమిది మందితో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా టీడీపీ తొలి జాబితా వెలువ‌డ‌నుంది. ఈ లిస్టులో గ‌న్ని పేరు ఉంది. నిజానికి ఇక్క‌డి ప్ర‌జ‌లు కూడా కోరుతున్న‌ది ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా ఉంగుటూరులో 2014 త‌ర్వాత జ‌రిగిన అభివృద్ధితో మ‌రోసారి ప్ర‌జ‌లు గ‌న్నికి ప‌ట్టం క‌ట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.