జగన్ పార్టీలోకీ చేరిన సీఐ, టికేట్ కన్ఫామ్

ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసిన పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ జగన్ సమక్షంలో శనివారం వైసీపీలో చేరారు. గతంలో ఊహించినట్లుగానే నేడు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఐ పదవికి రాజీనామా చేసి రావాలని మాధవ్‌ను వైసీపీ హైకమాండ్ కోరడంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి నేడు వైసీపీలో చేరారు. గతంలో మాధవ్ సాక్షాత్తు అధికార పార్టీ ఎంపీపైనే మీసం మెలేసి సంచలనం సృష్టించారు. పోలీస్‌శాఖలో కానిస్టేబుల్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించింది మొదలు ఆయన వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. రాజకీయాలను అడ్డంపెట్టుకొని దందాలు చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తారనే పేరుంది. ఆ కమిట్‌మెంట్, నిజాయితీలే ఆయనకు ప్రజల్లో ఎక్కడలేని క్రేజ్ తెచ్చిపెట్టాయి. మరి రాజకీయాల్లో ఆయన జీవితం ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.