జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన జీవిత, రాజశేఖర్

టాలీవుడ్ నటులు రాజశేఖర్, జీవిత దంపతులు వైసీపీలో జాయిన్ అయ్యారు. లోటస్ పాండ్‌లో సోమవారం ఉదయం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి‌తో భేటీ అనంతరం.. పార్టీ కండువా కప్పుకున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే.. సూపర్ డూపర్ అనేలా పాలన అందిస్తారని రాజశేఖర్ అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం పని చేస్తారని తెలిపారు. గతంలో జగన్‌తో విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని.. అయితే తాము గతంలో చూసిన జగన్ వేరు.. ఇప్పుడున్న జగన్ వేరని చెప్పారు.

గతంలో వైసీపీలో ఉన్న ఈ దంపతులు.. జగన్‌తో విభేదాలు కారణంగా.. బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి.. గతేడాది చంద్రబాబుకు మద్దతు పలుకుతూ టీడీపీలో చేరారు. ఇప్పడు మళ్లీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఇదిలా ఉంటే జీవిత, రాజశేఖర్‌లతో పాటు పలువురు సినీ తారలు వైసీపీ కండువా కప్పుకున్నారు. సినీ నటి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు హేమ, టీవీ యాంకర్ శ్యామల దంపతులు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.