ఆ ఇద్ద‌రు ఎల్లో వారియ‌ర్స్‌… ఫ్యూచ‌ర్ వీరిదే…!

వారిద్ద‌రు బీసీ వ‌ర్గానికి చెందిన మ‌హిళా నాయ‌కులు. ఇద్ద‌రూ అధికార‌ టీడీపీలోనే ఉన్నారు. ఒక‌రు పార్టీ ప్ర‌ధాన కార్య ద‌ర్శి హోదాలో ఉండ‌గా మ‌రొక‌రు శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్య‌క్షురాలిగా ఉన్నారు. వారే పంచుమ‌ర్తి అనురాధ‌, మ‌రొక‌రు దివంగ‌త నేత స‌ర్దార్ గౌతు ల‌చ్చ‌న్న మ‌న‌వ‌రాలు, ప‌లాస ఎమ్మెల్యే గౌతు శివాజీ కుమార్తె గౌతు శిరీష‌. ఈ ఇద్ద‌రు మ‌హిళా నాయ‌కులు కూడా బీసీ వ‌ర్గానికి ప్ర‌తినిధులుగానే కాకుండా పార్టీకి అత్యుత్త‌మ గ‌ళాలుగా కూడా మారారు పార్టీని ప్ర‌మోట్ చేయ‌డంలోనూ, పార్టీకి సం బంధించిన విష‌యాల‌ను ముందుకు తీసుకు వెళ్ల‌డంలోనూ ఇద్ద‌రు మ‌హిళలూ దూసుకుపోతున్నారు. పంచుమ‌ర్తి విష యానికి వ‌స్తే.. గ‌తంలో విజ‌య‌వాడ కార్పొరేష‌న్‌కు మేయ‌ర్‌గా ఆమె వ్య‌వ‌హ‌రించారు.

విజ‌య‌వాడ‌ను అన్ని విధాలా అభివృద్ది బాట‌లో న‌డిపించారు. అదేస‌మ‌యంలో పార్టీకి ఫైర్ బ్రాండ్‌గా మారారు. ప్ర‌తి ప‌క్షాల విమ‌ర్శ‌ల‌పై విరుచుకుప‌డ‌డం, ప్ర‌తిప‌క్షాల‌ను టార్గెట్ చేయ‌డం పంచుమ‌ర్తి అనురాధకు రాజ‌కీయంగా అబ్బిన విద్య‌లుగా మారాయి. అదేస‌మ‌యంలో ఉత్త‌మ విశ్లేష‌కులుగా కూడా పార్టీల‌కు అతీతంగా పేరు తెచ్చుకున్నారు. ఇక‌, గౌతు శిరీష విష‌యానికి వ‌స్తే.. శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్య‌క్షురాలిగా ఉన్న శిరీష‌.. పార్టీని ముందుకు న‌డిపించ‌డంలో ముందున్నారు. వాస్త‌వానికి రాజ‌కీయ వార‌స‌త్వంగా పార్టీ వ‌చ్చినా.. ఆమె ఎప్పుడూ పార్టీని వార‌స‌త్వంగా భావించ‌లేదు. ఎప్పుడూ కూడా త‌న ప‌నితనంతోనే ఆమె జిల్లాలో దూసుకుపోయారు. ఏ స‌మ‌స్య వ‌చ్చినా.. ప‌రిష్క‌రిస్తూ.. ముందు చూపుతో వ్య‌వ‌హ‌రించారు. సీనియ‌ర్ అయిన త‌న తండ్రి శ్యామ్ సుంద‌ర శివాజీని, జిల్లాలో ఉద్దండులు అయిన పార్టీ నాయ‌కుల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుంటూ.. రాజ‌కీయానికి వార‌స‌త్వం ఉండ‌కూడ‌ద‌ని, ప‌నికి, ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డంలోనే వార‌స‌త్వం ఉండాల‌ని ప‌దే ప‌దే ప్ర‌క‌టించిన ఆమె అదే త‌ర‌హాలో ముందుకు వెళ్లారు. ఇటీవ‌ల రాజ‌మండ్రిలో జ‌రిగిన జ‌య‌హో బీసీ స‌భ‌లో పంచుమ‌ర్తి అనురాధ తోపాటు గౌతు శిరీష కూడా పార్టీ అభివృద్ధి ప‌నుల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డంతోపాటు, బీసీల‌కు ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నుల‌ను, ప్ర‌వేశ పెడుతున్న ప‌థ‌కాల‌ను కూడా వివ‌రించి ప్ర‌భుత్వాన్ని ప్ర‌జ‌ల‌కు చేరువ చేసే ప్ర‌య‌త్నం చేశారు ముఖ్యంగా ఒంట‌రి మ‌హిళ‌ల‌కు ప్ర‌భుత్వం పింఛ‌ను ఇచ్చే ఏర్పాటు చేశారు శిరీష‌.

ప‌లు కార‌ణాల నేప‌థ్యంలో భ‌ర్త‌కు దూర‌మ‌య్యే ఒంట‌రి మ‌హిళ‌ల స‌మ‌స్య‌ల‌ను ఆమె చంద్ర‌బాబుకు వివ‌రించి వారికి కూడా పింఛ‌ను ఏర్పాటు చేయించారు. ఆది నుంచి కూడా రాజ‌కీయ వార‌స‌త్వం కాకుండా ప‌నులు చేయ‌డంలో వార‌స‌త్వం అందిపుచ్చుకున్నారు శిరీష‌. ఎప్ప‌టి నుంచో అప‌రిష్కృతంగా ఉన్న ప‌నులు పూడిలంక కు రోడ్డు వేయించ‌డంలో శ్ర‌ద్ధ తీసుకున్నారు. ఇలా ప్ర‌తి విష‌యంలోనూ ముందు చూపుతో వ్య‌వ‌హ‌రించి అంద‌రి మ‌న్న‌న‌లు పొందిన ఆమె వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జాప్ర‌తినిధిగా ఎన్నికైతే.. ప్ర‌జ‌ల‌కు మ‌రింత సేవ చేసే అవ‌కాశం ఉంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే టీడీపీలో బీసీ మ‌హిళ‌లుగా వీరిద్ద‌రు పార్టీకి భ‌విష్య‌త్తులో కీల‌కం కానున్నారు.