గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణిపై నాగార్జున ఊహించ‌ని కామెంట్స్‌

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ జీవితంలో ఈ రోజు చ‌రిత్ర‌లో మ‌ర‌పురానిదిగా మిగిలిపోతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. శాత‌వాహ‌న రాజు గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఆథారంగా తెర‌కెక్కిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమా బాల‌య్య‌కు తిరుగులేని హిట్ ఇచ్చింది. సినిమాకు అన్ని వ‌ర్గాల నుంచి పాజిటివ్ టాక్ వ‌చ్చింది. చిత్ర‌, రాజ‌కీయ రంగాల‌కు చెందిన సెల‌బ్రిటీలు సైతం శాత‌క‌ర్ణి సూప‌ర్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే బాలకృష్ణకు ఓ ఊహించని వ్యక్తి నుంచి శుభాకాంక్షలు లభించాయి. చాలా రోజులుగా బాలయ్యకు దూరంగా ఉంటూ వస్తున్న టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా గురించి ట్వీట్‌ చేశాడు. ఆ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్న‌ట్టు ఆయ‌న పేర్కొన్నాడు.

ఈ రోజు శాత‌క‌ర్ణి రిలీజ్ పుర‌స్క‌రించుకుని నాగ్ ట్వీట్ట‌ర్‌లో స్పందించాడు. ‘బాలయ్య, క్రిష్‌ అండ్‌ టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌. నాకు హిస్టారికల్‌ సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే ఈ సినిమా కూడా హిస్టరీ క్రియేట్‌ చేయాలని కోరుకుంటున్నాన’ని నాగ్‌ ట్వీట్‌ చేశాడు.

గ‌త మూడేళ్లుగా నాగ్‌-బాల‌య్య మ‌ధ్య స‌రైన సంబంధాలు లేవు. వీరిద్ద‌రు ఒక‌రి ఫంక్ష‌న్ల‌కు మ‌రొక‌రు వెళ్ల‌డం గాని, ఒక‌రిని ఒక‌రు ప‌ల‌క‌రించుకోవ‌డం కాని లేవు. అలాంటి టైంలో బాల‌య్య శాత‌క‌ర్ణికి నాగ్ శుభాకాంక్ష‌లు చెప్ప‌డం సంచ‌ల‌నంగా మారింది.

11

Read More:

రివ్యూ: గౌతమిపుత్ర శాతకర్ణి

శాత‌క‌ర్ణిపై రాజ‌మౌళి రివ్యూ

శాత‌క‌ర్ణిలో పెద్ద మైన‌స్

 బాల‌య్య‌కు అక్క‌డ అదిరిపోయే షాక్‌

జగన్ తమ్ముడికి చంద్రబాబు షాక్

బాల‌య్య థియేట‌ర్లో ఎలా ఎంజాయ్ చేసాడో తెలుసా

Gautamiputra Satakarni review, rating, live updates, public talk

 

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *